జగన్... ఏపీ మాఫియా డాన్: మహాసేన రాజేశ్
ABN , Publish Date - Dec 12 , 2025 | 07:04 AM
జగన్ ఆంధ్ర గూండా రాజ్ మాత్రమే కాదు... మాఫియా డాన్ కూడా అని టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేశ్ విమర్శించారు.
అమరావతి, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): ‘జగన్ ఆంధ్ర గూండా రాజ్ మాత్రమే కాదు... మాఫియా డాన్ కూడా’ అని టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేశ్ విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘బోరుగడ్డ అనీల్ రాష్ట్రం కోసమో, దేశం కోసమో పనిచేసిన వ్యక్తి కాదు. కేవలం ఓ రౌడీషీటర్. అలాంటి వ్యక్తిని బెయిల్‌పై జగన్ బయటకు తీసుకొచ్చి అంత ప్రేమ చూపడంలో మర్మం ఏమిటో? తల్లి చెల్లి అని తేడా లేకుండా బూతులు మాట్లాడే వ్యక్తిని బెయిలుపై బయటకు తీసుకురావాల్సిన అవసరం ఏమిటో జగన్ చెప్పాలి’ అని రాజేశ్ డిమాండ్ చేశారు. డ్రగ్స్ ముఠాకు జగన్ అండ: మేడా రాష్ట్రంలో డ్రగ్స్ ముఠాలను జగన్ పెంచి పోషిస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి విమర్శించారు. ‘2019-24 మధ్య ఐదేళ్లలో రాష్ట్రంలో కల్తీ మద్యం, డ్రగ్స్‌ను విచ్చలవిడిగా సరఫరా చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. వైసీపీ విద్యార్థి విభాగం నాయకుడు కొండారెడ్డి డ్రగ్స్ కేసులో పట్టుబడితే ఏదో చిన్న పిల్లాడు తెలియక చేశాడని జగన్ మాట్లాడారు. ఆయన డ్రగ్స్ ముఠాలకు ఏ స్థాయిలో సహకరిస్తున్నారో తెలుసుకోవడానికి ఆ మాటలే నిదర్శనం’ అని మేడా అన్నారు.