Share News

State Spokesperson NB Sudhakar Reddy: మంత్రిపై వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా

ABN , Publish Date - Aug 27 , 2025 | 05:58 AM

కొన్ని చానళ్లలో తాను పొరపాటున ఓ మంత్రిపై ఆవేదనతో అనుచిత వ్యాఖ్యలు చేశానని.. ఎవరిపైనా తనకు వ్యక్తిగత కక్ష లేదని తిరుపతి జిల్లాకు చెందిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్‌బీ సుధాకర్‌రెడ్డి తెలిపారు.

State Spokesperson NB Sudhakar Reddy: మంత్రిపై వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా

  • టీడీపీ క్రమశిక్షణ కమిటీకి రాష్ట్ర అధికార ప్రతినిధి సుధాకర్‌రెడ్డి వివరణ

అమరావతి, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): ‘కొన్ని చానళ్లలో తాను పొరపాటున ఓ మంత్రిపై ఆవేదనతో అనుచిత వ్యాఖ్యలు చేశానని.. ఎవరిపైనా తనకు వ్యక్తిగత కక్ష లేదని తిరుపతి జిల్లాకు చెందిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్‌బీ సుధాకర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ఆయన పార్టీ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరై తన సంజాయిషీ ఇచ్చారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ.. తాను మంత్రిపై చేసిన వ్యాఖ్యలపై పశ్చాత్తాపపడుతున్నట్లు తెలిపారు. ఆ వ్యాఖ్యలను క్రమశిక్షణ కమిటీ ముందు వెనక్కి తీసుకున్నట్లు చెప్పారు. ఇటీవల సుధాకర్‌రెడ్డి టీవీ డిబేట్‌లో ఓ మంత్రిపై చేసిన వ్యాఖ్యలను పార్టీ అధిష్ఠానం సీరియ్‌సగా తీసుకుంది. క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆయన్ను ఆదేశించింది. దీంతో ఆయన సదరు కమిటీ సభ్యులు వర్ల రామయ్య, పంచుమర్తి అనూరాధ, కొనకళ్ల నారాయణరావు ముందు హాజరై వివరణ ఇచ్చారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రికి జిల్లా సమస్యలు చెప్పడానికి వెళ్తే.. తనకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వకుండా ఆయన హోటల్‌ రూంలో ఏకాంతంగా గడపడం వల్లే తానలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని సుధాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.

Updated Date - Aug 27 , 2025 | 06:00 AM