Share News

రాష్ట్రాన్ని చెత్త దిబ్బగా మార్చిన వైసీపీ ప్రభుత్వం: పట్టాభిరామ్‌

ABN , Publish Date - Dec 13 , 2025 | 05:13 AM

వైసీపీ ప్రభుత్వం చెత్తపై పన్ను వేసి రాష్ట్రాన్ని చెత్త దిబ్బగా మార్చిందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ విమర్శించారు.

రాష్ట్రాన్ని చెత్త దిబ్బగా మార్చిన వైసీపీ ప్రభుత్వం: పట్టాభిరామ్‌

అనంతపురం క్లాక్‌టవర్‌, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వం చెత్తపై పన్ను వేసి రాష్ట్రాన్ని చెత్త దిబ్బగా మార్చిందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ విమర్శించారు. ఆ చెత్తను తొలగించి రాష్ట్రాన్ని స్వచ్ఛ, స్వర్ణాంధ్రగా తయారు చేయడానికి సీఎం చంద్రబాబు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారారన్నారు. అనంతపురంలోని డంపింగ్‌ యార్డులో బయో మైనింగ్‌ను శుక్రవారం ఆయన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ డైరెక్టర్‌ భవాని రవికుమార్‌తో కలిసి పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. సుమారు 40 ఏళ్ల డంపింగ్‌ యార్డు సమస్యకు టీడీపీ కూటమి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతోందని వెల్లడించారు.

Updated Date - Dec 13 , 2025 | 05:14 AM