Share News

TDP leader BTech Ravi: మోసకారి జగన్‌ను ప్రజలు నమ్మరు!

ABN , Publish Date - Nov 27 , 2025 | 05:09 AM

రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమే కాకుండా ప్రజల్లో భయాందోళనలు కలిగించి, శాంతిభద్రతలే లేకుండా చేసిన వైసీపీ అధ్యక్షుడు జగన్‌...

TDP leader BTech Ravi: మోసకారి జగన్‌ను ప్రజలు నమ్మరు!

  • అరటి తోటల సంద ర్శన పెద్ద నాటకం

  • ఉనికి కోసమే చంద్రబాబుపై విమర్శలు: బీటెక్‌ రవి

కడప మారుతీనగర్‌, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమే కాకుండా ప్రజల్లో భయాందోళనలు కలిగించి, శాంతిభద్రతలే లేకుండా చేసిన వైసీపీ అధ్యక్షుడు జగన్‌ మోసకారి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితులు లేవని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి అన్నారు. బుధవారం కడపలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. గత వైసీపీ పాలనలో విధ్వంసాన్ని ప్రజలు మరిచిపోలేదన్నారు. జగన్‌ మూడుసార్లు భూమిపూజ చేసినా స్టీల్‌ ఫ్యాక్టరీ మొదలు కాలేదని, అదే స్టీల్‌ ఫ్యాక్టరీ నిర్మాణానికి చంద్రబాబు సారధ్యంలోని ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ప్రస్తుతం పనులు జరుగుతున్నాయని తెలిపారు. జగన్‌ పాలనలో కడప జిల్లాకు ఏం చేశారో చెప్పేందుకు ఒక్కటంటే ఒక్క అంశమైనా ఉందా అని ప్రశ్నించారు. పులివెందులలోని పైడిపాలెం, చిత్రావతికి నీరు ఇచ్చింది తెలుగుదేశం పాలనలోనే అన్నారు. గిట్టుబాటు ధర లేదంటూ పులివెందులలో అరటి తోటలను జగన్‌ సందర్శించడం పెద్ద నాటకమని విమర్శించారు. ఉనికి కోసం అరటి రైతుల పరామర్శ పేరుతో చంద్రబాబును తిట్టేందుకే జగన్‌ అరటి తోటల సందర్శన పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.

Updated Date - Nov 27 , 2025 | 05:09 AM