Share News

Sajjala Ramakrishna Reddy: సజ్జల జైలుకు వెళ్లడం ఖాయం!

ABN , Publish Date - Nov 27 , 2025 | 05:38 AM

వైసీపీ పతనానికి సజ్జల రామకృష్ణారెడ్డి కారణమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న చెప్పారు. సజ్జల పగటి కలలు కనడం మానుకోవాలన్నారు.....

Sajjala Ramakrishna Reddy: సజ్జల జైలుకు వెళ్లడం ఖాయం!

  • వైసీపీ పతనానికి ఆయనే కారణం: బుద్దా వెంకన్న

విజయవాడ(వన్‌టౌన్‌), నవంబరు 26(ఆంధ్రజ్యోతి): వైసీపీ పతనానికి సజ్జల రామకృష్ణారెడ్డి కారణమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న చెప్పారు. సజ్జల పగటి కలలు కనడం మానుకోవాలన్నారు. చంద్రబాబుపై సజ్జల చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు త్వరలో కేఏ పాల్‌ పార్టీలోకి, సజ్జల జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. విజయసాయి రెడ్డి వైసీపీకి రాజీనామా చేస్తూ ఆ పార్టీ నాశనమైందని ఎందుకు వ్యాఖ్యానించాడో ఇపుడు అర్థమవుతోందన్నారు. చంద్రబాబుపై అన్యాయంగా కేసులు పెట్టినందునే జగన్‌ను ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారన్నారు. జగన్‌ హయాంలో రైతులకు ఏం మేలు జరిగిందో మొసలి కన్నీరు కారు స్తున్న సజ్జల చెప్పాలని డిమాండ్‌చేశారు. వైసీపీ ఇక అధికారంలోకి రావడం కలేనని చెప్పారు. పార్టీ నాశనానికి సజ్జలే కారణమని ఆ పార్టీనాయకులే చెబుతున్నారని, ఈ అంశాన్ని జగన్‌ గ్రహించకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. సజ్జల చేసిన ఘోరాలు, పాపాలు బయటపడుతున్నాయని, త్వరలోనే జైలుకు వెళతాడని బుద్దా వెంకన్న తెలిపారు.

Updated Date - Nov 27 , 2025 | 05:38 AM