Share News

వైసీపీ హయాం ఆత్మహత్యలకు కూటమి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా

ABN , Publish Date - Jul 08 , 2025 | 03:52 AM

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు తాజాగా కూటమి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించింది. గత ప్రభుత్వం కాలంలో 2022లో ఐదుగురు, 2023లో 77 మంది, 2024లో మే నెల వరకూ 46 మంది రైతులు...

వైసీపీ హయాం ఆత్మహత్యలకు కూటమి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా

  • వైసీపీ హయాంలో రైతు ఆత్మహత్యలకు కూటమి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లింపు

అమరావతి, జూలై7(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు తాజాగా కూటమి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించింది. గత ప్రభుత్వం కాలంలో 2022లో ఐదుగురు, 2023లో 77 మంది, 2024లో మే నెల వరకూ 46 మంది రైతులు... మొత్తం 128 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆ కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియాను వైసీపీ ప్రభు త్వం వివిధ దశల్లో పెండింగ్‌లో పెట్టింది. వాటిలో 81 కేసుల్లో రైతు కుటుంబాలకు కూటమి ప్రభుత్వం నష్టపరిహారం కింద రూ.5.67 కోట్లు విడుదల చేసింది. కాగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకూ మొత్తం 104 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు నమోదయిం ది. ఆయా కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించడానికి అసవరమైన 7.28 కోట్ల బిల్లులను అధికారులు సిద్ధం చేశారు. కాగా, గత ప్రభుత్వ హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కటుంబాల్లో మిగిలిన వారి బిల్లులు వివిధ దశల్లో ఉన్నాయని వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ డిల్లీరావు సోమవారం రాత్రి తెలిపారు.

Updated Date - Jul 08 , 2025 | 03:52 AM