మహిళలకు ప్రాధాన్యమిస్తున్న టీడీపీ: ఎమ్మెల్యే
ABN , Publish Date - Dec 22 , 2025 | 11:57 PM
దేశంలోనే మహిళలకు ప్రాధాన్యమిస్తున్నది టీడీపీ అని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు.
నందికొట్కూరు, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే మహిళలకు ప్రాధాన్యమిస్తున్నది టీడీపీ అని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. సోమవారం పట్టణంలోని నియోజకవర్గ విజన ప్లాన యూనిట్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ నంద్యాల, కర్నూలు జిల్లాల అధ్యక్షులుగా గౌరు చరితారెడ్డి, గుడిసె క్రిష్ణమ్మలను నియమిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. మహిళలకు సంక్షేమం, ఆర్థికాభివృద్ధి, సాధికారతతో పాటు పార్టీ సారధ్య బాధ్యతలను అప్పగించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. నంద్యాల జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ సీట్లను మహిళలకు కేటాయించి వారిని గెలిపించారన్నారు.
అంగనవాడీలకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ
అంగనవాడీ సూపర్‌వైజర్లు, కార్యకర్తలకు 5 జీ స్మార్ట్ ఫోన్లును ముఖ్యమంత్రి చంద్రబాబు అందజేస్తున్నారని ఎమ్మెల్యే జయసూర్య అన్నారు. సోమవారం ఐసీడీఎస్ కార్యాలయంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖలో పని చేస్తున్న సూపర్‌వైజర్లు, అంగనవాడీ కార్యకర్తలకు 5జీ స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాండ్ర సురేంద్రనాథ్‌రెడ్డి, షకీల్ అహ్మద్, ముర్తుజావలి, జాకీర్ హుస్సేన, వేణుగోపాల్, వడ్డె శ్రీను, ఐసీడీఎస్ సీడీపీవో మంగళ్లి పాల్గొన్నారు.