Share News

TDP Poll Push: టీడీపీ సంస్థాగత ఎన్నికల నిర్వహణకు కమిటీ

ABN , Publish Date - Apr 17 , 2025 | 06:14 AM

టీడీపీ సంస్థాగత ఎన్నికల నిర్వహణకు వర్ల రామయ్య అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో కమిటీని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. మే 15 నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించారు

TDP Poll Push: టీడీపీ సంస్థాగత ఎన్నికల నిర్వహణకు కమిటీ

  • వర్ల రామయ్య చైౖర్మన్‌గా ఆరుగురు సభ్యులతో నియామకం

అమరావతి, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణ ప్రక్రియ జోరుగా సాగుతోంది. తాజాగా వర్ల రామయ్య చైర్మన్‌గా ఎన్నికల నిర్వహణ కమిటీని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. ఈ కమిటీలో సభ్యులుగా మంత్రులు నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్‌, ఎస్‌.సవితతోపాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎండీ షరీఫ్‌, దగ్గుమళ్ల ప్రసాదరావును నియమించారు. మే 15 నాటికి అసెంబ్లీ, పార్లమెంటు కమిటీల ఎన్నికను పూర్తి చేయాలని పార్టీ అధినేత ఇప్పటికే ఆదేశించారు.

Updated Date - Apr 17 , 2025 | 06:14 AM