AP Govt: 15 వరకు సుపరిపాలనలో తొలి అడుగు
ABN , Publish Date - Aug 12 , 2025 | 06:33 AM
తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఆగస్టు 15తో ముగించాలని పార్టీ అధిష్ఠానం ఆదేశించింది.
40 రోజుల్లో కోటికిపైగా ఇళ్లకు టీడీపీ శ్రేణులు
అమరావతి, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఆగస్టు 15తో ముగించాలని పార్టీ అధిష్ఠానం ఆదేశించింది. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జూలై 2న కుప్పంలో సీఎం చంద్రబాబు, మంగళగిరిలో మంత్రి లోకేశ్ ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. తొలి 18 రోజుల్లోనే 50 లక్షలకుపైగా ఇళ్లకు వెళ్లిన టీడీపీ శ్రేణులు ఆగస్టు 10నాటికి... కోటికిపైగా ఇళ్లకు వెళ్లి ప్రజాభిప్రాయాలను తెలుసుకుని, అధిష్ఠానానికి నివేదించారు. టీడీపీ మంత్రులు తమ నియోజకవర్గాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 85 నియోజకవర్గాల్లో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు.