TDP Disciplinary Committee: కొలికపూడి, కేశినేని చిన్నికి పిలుపు
ABN , Publish Date - Nov 02 , 2025 | 05:43 AM
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని), ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివా్‌సకు టీడీపీ క్రమశిక్షణ కమిటీ నుంచి పిలుపువచ్చింది.
4న హాజరు కావాలన్న టీడీపీ క్రమశిక్షణ కమిటీ
అమరావతి, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని), ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివా్‌సకు టీడీపీ క్రమశిక్షణ కమిటీ నుంచి పిలుపువచ్చింది. ఈ నెల 4వ తేదీ ఉదయం 11 గంటలకు క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాలని కొలికపూడి శ్రీనివాస్ కు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పిలుపు వెళ్లింది. అదేరోజు సాయంత్రం 4 గంటలకు తమ ముందు హాజరు కావాలని కేశినేని చిన్నికి క్రమశిక్షణ కమిటీ సమాచారం పంపింది. ఇద్దరి మధ్య విభేదాల నేపథ్యంలో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఈనిర్ణయం తీసుకున్నారు. క్రమశిక్షణ కమిటీలో మంత్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ పంచుమర్తి అనూరాధ, పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, షరీఫ్, కొనకళ్ల నారాయణ ఉన్నారు.