TDP Corporators: నెల్లూరు మేయర్‌పై అవిశ్వాసం
ABN , Publish Date - Nov 25 , 2025 | 06:06 AM
నెల్లూరు మేయర్ పోట్లూరి స్రవంతి (వైసీపీ)పై కార్పొరేటర్లు తిరుబాటు బావుటా ఎగురవేశారు.
జేసీకి కార్పొరేటర్ల లేఖ
నెల్లూరు(సిటీ), నవంబరు 24(ఆంధ్రజ్యోతి): నెల్లూరు మేయర్ పోట్లూరి స్రవంతి (వైసీపీ)పై కార్పొరేటర్లు తిరుబాటు బావుటా ఎగురవేశారు. ఆమెను మేయర్ పదవి నుంచి దించేయాలని సోమవారం జేసీ వెంకటేశ్వర్లుకు లేఖ అందించారు. నెల్లూరు కార్పొరేషన్‌లో 54 స్థానాలుండగా, ఒకరు రాజీనామా చేశారు. కాగా 53 స్థానాలున్నాయి. ఇందులో టీడీపీకి 40 స్థానాలుండగా, వైసీపీకి 12 స్థానాలు ఉన్నాయి. మరొకరు తటస్థంగా ఉన్నారు. అధికార టీడీపీ కార్పొరేటర్లు మేయర్‌పై అవిశ్వాసాన్ని పెట్టాలని కోరుతూ లేఖపై సంతకాలు చేసి జేసీకి అందచేశారు. నాలుగేళ్లు పదవీకాలం పూర్తవడంతో న్యాయపరమైన చిక్కులు తొలగినందున ఆమెపై అవిశ్వాసం పెట్టి, తొలగించాలని కోరారు. ఆమె అవినీతిపైనా విచారణ చేపట్టాలని వారు మీడియో సమావేశంలో డిమాండ్ చేశారు.