Markapuram: తల్లికి వందనంతో ఆర్థిక ఆసరా
ABN , Publish Date - Jun 15 , 2025 | 06:26 AM
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణానికి చెందిన ఆవుల అల్లూరమ్మ, శ్రీనివాసులుకు ఆరుగురు సంతానం. చిన్నపాటి అద్దె రేకుల ఇంట్లో నివాసం ఉంటున్నారు. పాత ఇనుముకు ఉల్లిగడ్డలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు.
మార్కాపురంలో ఓ కుటుంబానికి 65 వేలు
చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులు
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణానికి చెందిన ఆవుల అల్లూరమ్మ, శ్రీనివాసులుకు ఆరుగురు సంతానం. చిన్నపాటి అద్దె రేకుల ఇంట్లో నివాసం ఉంటున్నారు. పాత ఇనుముకు ఉల్లిగడ్డలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. పిల్లలు అంకాలు 10వ తరగతి, వీరాంజనేయులు 8వ తరగతి, శివకేశవ 7వ తరగతి, వెంకటస్వామి 5వ తరగతి, సాయిపల్లవి 2వ తరగతి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. ఆరో సంతానం బాబు(3) అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్తున్నాడు. పిల్లలను పోషించేందుకే ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద ఐదుగురు పిల్లలకు కలిపి రూ.65 వేలు తల్లి బ్యాంకు ఖాతాలో జమ చేసింది. దీంతో ఇక తమ కష్టాలు తీరుతాయని, పిల్లలను ఉన్నతంగా చదవించి తీర్చిదిద్దుతామని అల్లూరమ్మ తెలిపారు. తమ కుటుంబానికి ఆర్థిక ఆసరా ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
- మార్కాపురం, ఆంధ్రజ్యోతి