Share News

బినామీ పాసుబుక్కులపై చర్యలు తీసుకోండి

ABN , Publish Date - Jul 19 , 2025 | 11:53 PM

ఏపీఐఐసీలో బినామి పేర్లతో పాసుబుక్‌లు పొందిన వారిపై కేసులు నమోదు చేయాలని సీపీఐ ఎంఎల్‌ పార్టీ నేతలు ఆర్డీవో చంద్రమోహనను కోరారు.

బినామీ పాసుబుక్కులపై చర్యలు తీసుకోండి
ఆర్డీవో చంద్రమోహనకు వినతిపత్రం అందిస్తున్న దృశ్యం

బద్వేలు, జూలై 19 (ఆంధ్రజ్యో తి): ఏపీఐఐసీలో బినామి పేర్లతో పాసుబుక్‌లు పొందిన వారిపై కేసులు నమోదు చేయాలని సీపీఐ ఎంఎల్‌ పార్టీ నేతలు ఆర్డీవో చంద్రమోహనను కోరారు. శనివారం ఆమేర కు ఆర్డీవోకు వారొక వినతిపత్రం అందించారు. అనంతరం ఆ పార్టీ జిల్లా స్టాండింగ్‌ కమిటీ సభ్యుడు చంద్రశేఖర్‌ మాట్లాడుతూ గోపవరం ప్రాజెక్టు కాలనీ సొసైటీ ఆధీనంలో ఉన్న సుమారు 1500 ఎకరాలు పై గా ఉన్న భూమిని ఏఐసీసీకి కేటాయిస్తూ ఆ సొసైటీలోని సభ్యులకు 50 సెంట్లు ప్రభుత్వభూమి ఇవ్వాలని ప్రతిపాదన ఉన్నప్పటికీ కొంతమంది రెవెన్యూ అధికారులు అప్పట్లో ఇతరులకు సహకరించి వారికి చెందేలా చూశారన్నారు.అలాగే 157 సర్వే నెంబరులోని కబ్జా అయిన 15 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని కోరారు. సీపీఐఎంఎల్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jul 19 , 2025 | 11:53 PM