Share News

ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై తహసీల్దార్‌ విచారణ

ABN , Publish Date - May 03 , 2025 | 11:10 PM

కొత్త పల్లె పంచాయతీ అమృతనగర్‌లోని ప్రభు త్వ ఇళ్లస్థలాల ఆక్రమణలపై తహసీల్దారు గంగయ్య శనివారం విచారణ జరిపారు.

 ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై తహసీల్దార్‌ విచారణ
ప్రభుత్వ స్దలాల ఆక్రమించిన వారిని విచారిస్తున్న తహసీల్దారు గంగయ్య

ప్రొద్దుటూరు, మే 3 (ఆంధ్రజ్యోతి) : కొత్త పల్లె పంచాయతీ అమృతనగర్‌లోని ప్రభు త్వ ఇళ్లస్థలాల ఆక్రమణలపై తహసీల్దారు గంగయ్య శనివారం విచారణ జరిపారు. స్థానిక తహసీల్దారు కార్యాలయంలో మాడిశెట్టి ప్రతాప్‌ అనే వ్యక్తి జనవరి 27న ఇచ్చిన ఫిర్యాదు మేరకు తహసీల్దారు గం గయ్య సుబ్బారెడ్డి అలియాస్‌ సుబ్రమణ్యం యాదవ్‌, మహానంది, జయరామ్‌ ఆచారిల ను విచారించారు. సుబ్బారెడ్డి అనే వ్యక్తి ప్రభుత్వ స్ధలాన్ని ఆక్రమించి కమర్షియల్‌ రూములు నిర్మించాడని ప్రతాప్‌ ఆరోపించారు. అలాగే మహానంది, జయరామ్‌ ఆచా రిలు కూడా కొందరు వ్యక్తుల దగ్గర ప్రభుత్వ స్ధలాలు అక్ర మంగా కొని ఆస్ధలాల్లో ఇళ్లు రూములు నిర్మించి విక్రయించి సొమ్ముచేసుకున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలపై తహసీల్దారు ప్రతాప్‌కు ఆ స్ధలాల వివరాలు పూర్తిగా అందజేయాలని అవి ఈ ముగ్గు రికి సంబంధం లేకుండా అక్రమంగా ఆక్రమించి నిర్మించి విక్రయించి ఉంటే వారిపై క్రిమినల్‌ కేసులకు ప్రతిపాదిస్తానని తెలిపారు. ఇరువురిని తమ వద్ద ఉన్న ఆధార పత్రాలు తేవాలని తెలిపారు.

Updated Date - May 03 , 2025 | 11:10 PM