Share News

adikonda MLA Tenali Sravan Kumar: మోసానికి ప్రతిరూపం జగన్‌, సజ్జల

ABN , Publish Date - Sep 14 , 2025 | 04:06 AM

జగన్మోహన్‌రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి మోసానికి ప్రతిరూపమని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌ కుమార్‌ విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో..

adikonda MLA Tenali Sravan Kumar: మోసానికి ప్రతిరూపం జగన్‌, సజ్జల

  • ప్రజలను తప్పుదోవ పట్టించడానికే రాజధాని గురించి మాట్లాడుతున్నారు

  • తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌ కుమార్‌

అమరావతి, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): జగన్మోహన్‌రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి మోసానికి ప్రతిరూపమని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌ కుమార్‌ విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం మాట్లాడారు. ‘ప్రజలను తప్పుదోవ పట్టించడానికి సజ్జల రాజధానిపై మాట్లాడుతున్నారు. విధానపరమైన వ్యాఖ్యలు చేయడానికి సజ్జలకు ఏం అధికారం ఉం ది? జగన్‌ జనం ముందుకు వచ్చి అమరావతిపై తమ పార్టీ విధానం చెప్పాలి. 2014లో అమరావతికి పూర్తి మద్దతు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే మాట మార్చారు. అమరావతిపై అంత ప్రేమ ఉంటే 2019-24 మధ్య ఒక్క పని కూడా ఎందుకు కొనసాగించలేదు? రిషికొండకు గుండుకొట్టి రూ.వందల కోట్లు ప్యాలె్‌సకు తగలబెట్టిన జగన్‌... రాజధానిలో ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు. ఇప్పటికీ, భవనాలు కట్టడానికి అమరావతి పనికి రాదని, నీటిలో మునిగిపోతోందని విషప్రచారం ఎందుకు చేస్తున్నారో చెప్పాలి. అమరావతి వేశ్యల రాజధాని అని జగన్‌ తన సొంత చానల్‌లో డిబేట్లు పెట్టి చెప్పించి, ఇప్పుడు అధికారం కోసం అదే అమరావతిని అడ్డం పెట్టుకుంటున్నారు. గతంలో మూడు రాజధానులు అంటూ ఆయాప్రాంతాల ప్రజల్ని మభ్యపెట్టినందుకు వారికి క్షమాపణ చెప్పాలి’ అని ఎమ్మెల్యే శ్రావణ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు.

Updated Date - Sep 14 , 2025 | 04:06 AM