Anagani Satya Prasad: కుట్ర రాజకీయాలకు కేంద్రంగా తాడేపల్లి ప్యాలెస్
ABN , Publish Date - Jul 04 , 2025 | 03:57 AM
కుట్ర రాజకీయాలకు కేంద్రంగా తాడేపల్లి ప్యాలెస్ మారిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. గురువారం బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం కూచినపూడి...
రాష్ట్ర భవిష్యత్ పాలిట దుష్టశక్తిగా మారిన వైసీపీ: మంత్రి అనగాని
రేపల్లె, జూలై 3(ఆంధ్రజ్యోతి): కుట్ర రాజకీయాలకు కేంద్రంగా తాడేపల్లి ప్యాలెస్ మారిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. గురువారం బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం కూచినపూడి గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు, ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో తీవ్రవాదాన్ని ప్రేరేపించేలా జగన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. యువకులను తీవ్రవాదులుగా మార్చేలా రెచ్చగొడుతున్నారు. రాష్ట్ర భవిష్యత్తు పాలిటి దుష్టశక్తులుగా మారిన వారిని ఖచ్చితంగా అడ్డుకుంటాం. కుట్రలు, కుతంత్రాలు చేసే జగన్ బుద్ధి ఇంకా మారలేదు’ అని మంత్రి అనగాని విమర్శించారు.