అన్నదాతకు తీపి కబురు
ABN , Publish Date - May 28 , 2025 | 11:23 PM
కేంద్ర ప్రభుత్వం 2025-26 ఖరీఫ్ సీజనకు సంబంధించిన 14 ముఖ్యమైన పంటలకు మద్దతు ధర ఖరారు చేశారు.
2025-26 ఖరీఫ్ మద్దతు ధరల పెంపు
ముఖ్యమైన 14 పంటలకు మద్దతు ధర నిర్ణయం
కేంద్ర మంత్రివర్గం ఆమోదం
కర్నూలు అగ్రికల్చర్/ కర్నూలు, మే 28 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం 2025-26 ఖరీఫ్ సీజనకు సంబంధించిన 14 ముఖ్యమైన పంటలకు మద్దతు ధర ఖరారు చేశారు. 2024-25 ఖరీఫ్ మద్దతు ధరలపై ఈ పెరుగుదల ఉంటుంది. కీలకమైన వరి ధాన్యం మద్దతు ధర రూ.69 పెంచితే.. జిల్లాలో అత్యధికంగా సాగు చేస్తున్న పత్తి క్వింటాపై రూ.589 పెంచారు. రైతులకు ఇది ఎంతో ఊరట ఇస్తుంది. బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షత జరిగిన కేంద్ర మంత్రివర్గంలో కనీస మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఖరీఫ్ మార్కెంటింగ్ సీజనకు ఈ ధరలు వర్తిస్తాయి. మద్దతు ధర కంటే బహిరంగ మార్కెట్‌లో ఎక్కువ పలితే వ్యాపారులకు రైతులు అమ్ముకోవచ్చు. అంతకంటే తక్కువ ఉంటే ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.2.7 లక్షల కోట్టు కేటాయించింది. అభిల భారత సగటు ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 1.5 రెట్లు కనీస మద్దతు ధర ఉండేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం 2018-19 కేంద్ర బడ్జెట్‌లో ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి ఏటేటా ఖరీఫ్ సీజనకు ముందే కనీస మద్దతు ధరలను కేంద్రం ప్రకటిస్తుంది. ఈ ధరలకు అనుగుణంగా లాభసాటిగా ఉండే పంటలు సాగు చేసి ఆదాయం ఆర్జించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఆయా పంటలు ఉత్పత్తి వ్యయంలో 50 శాతానికి పైగా ఆదాయం ఉండేలా ఎంఎస్‌పీ నిర్ణయించారని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. పెరిగిన ధరలు ప్రకారం క్వింటా వరి సాధారణం రూ.2,369, గ్రేడ్-ఏ రూ.2,389కు చేరింది. పత్తి మధ్యస్థ రకం రూ.7,710కు చేరితే.. పిందె పొడువు పత్తి రూ.8.110కు చేరింది. వేరుశనగ రూ.7,263కు చేరింది.
ఫ 2024-25లో క్వింటాపై కనీస మద్దతు ధర, పెంచి ధర, 2025-26 ఖరీఫ్ మద్దతు ధర వివరాలు (రూ.లల్లో):
------------------------------------------------------------------------
పంటలు 2024-25 పెంచిన 2025-26
ఎంఎస్‌పీ మొత్తం ఎంఎస్‌పీ
-------------------------------------------------------------------------
వరి కామన 2,300 69 2,369
వరి గ్రేడ్-ఏ 2,320 69 2,389
జొన్న హైబ్రీడ్ 3,371 328 3,699
జొన్న మల్దండి 3,421 328 3,749
మొక్క జొన్న 2,225 175 2,400
సజ్జ 2,625 150 2,775
రాగులు 4,290 596 4,886
కందులు 7,550 450 8,000
పెసలు 8,682 86 8,768
మినుము 7,400 400 7,800
వేరుశనగ 6,783 480 7,263
సూర్యకాంతి 7,280 410 7,690
సోయబీన 4,892 436 5,328
మధ్యస్థం పత్తి 7,121 589 7,710
పందె పొడువు పత్తి 7,512 589 8,110