తియ్యటి మందు..
ABN , Publish Date - Apr 09 , 2025 | 11:44 PM
హోమియో గుళికలు తియ్యగా నోట్లో వేసుకుంటేనే కరిగిపోతాయి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు హోమియో వైద్యం వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.

హోమియోకు పెరుగుతున్న ఆదరణ
దీర్ఘకాలిక రోగాలకు ప్రత్యామ్నాయ వైద్యం
నేడు ప్రపంచ హోమియో ధినోత్సవం
కర్నూలు హాస్పిటల్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): హోమియో గుళికలు తియ్యగా నోట్లో వేసుకుంటేనే కరిగిపోతాయి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు హోమియో వైద్యం వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అలోపతి వైద్య విధానంలో సైడ్ ఎఫెక్ట్స్‌కు తాళలేక ప్రజల్లో హోమియో వాడకం ఎక్కువైంది. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులకు హోమియో తప్ప ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. ఖరీదు తక్కువగా ఉండటంతో ప్రజలు హోమియో వైద్యం వైపు మొగ్గు చూపుతున్నారు. జర్మనీ దేశానికి చెందిన శ్యామూల్ హానిమూన హోమియో వైద్య పితామహుడు. ఆయన తన నిరంతర పరిశోధన అనుభవంతో అనేక సత్ఫలితాలు సాధించారు. 208 సంవత్సరాల క్రితం హానిమూన కనుగొన్న మందులు ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాయి. నేడు వరల్డ్ హోమియో డే సందర్భంగా ఆంధ్రజ్యోతి కథనం...
దీర్ఘకాలిక వ్యాధులకు హోమియో ప్రత్యామ్నాయంగా ముందుకు వచ్చింది. అలోపతి వైద్యం భారీ ఖర్చుతో కూడినదిగా మారడం వల్ల పేద, మధ్య తరగతి రోగులు హోమియో వైపు మొగ్గు చూపుతున్నారు. కర్నూలు నగరంలో 20 ఏళ్ల క్రితం కేవలం నలుగురు హోమియో వైద్యులు ఉండేవారు. ప్రస్తుతం కర్నూలు, నంద్యాల జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు హోమియో వైద్యులు 150 మంది సేవలు అందిస్తున్నారు. దాదాపు ఐదు రెట్లు హోమియో వైద్యులు పెరిగారు. కర్నూలు, నంద్యాలలో కూడా కార్పొరేట్ సంస్థలు కూడా హోమియో క్లీనిక్‌లను ప్రారంభించారు.
ఫ ఉమ్మడి జిల్లాలో 21 డిస్పెన్సరీలు:
ఉమ్మడి జిల్లాలో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో 21 డిస్పెన్సరీలు పని చేస్తున్నాయి. ప్రభుత్వ హోమియో వైద్యులు 12 మంది ఉండగా.. ఎనహెచఎం కింద 9 మంది వైద్యులు సేవలందిస్తున్నారు. ఇక కర్నూలు ప్రభుత్వ హోమియో డిస్పెన్సరీలో రోజు ఓపీకి 60 నుంచి 70 మంది చికిత్స కోసం వస్తుంటారు. గత పది సంవత్సరాలతో పోలిస్తే హోమియోకు 40 శతం రోగులు పెరిగాయి.
ఫ దీర్ఘకాలిక ప్రయోజనాలు:
చర్మ వ్యాధులు, కీళ్ల నొప్పులు, అలర్జీ, మానసిక ఆందోళన, సైనసైటిస్, కిడ్నీలో రాళ్లు, సయాటికా, ఫైల్స్, తలనొప్పి (మైగ్రీన) అర్థరైటిస్, నరాల బలహీనత, టాన్సిల్స్, జీర్ణకోశ వ్యాధులు, సోరియాసిస్, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులకు హోమియో మందులతో మెరుగైన ఫలితాలు వస్తాయి. డెంగీ, మెదడువాపు, స్వైనఫ్లూ వంటి ప్రమాదకర వ్యాధులకు బాగా పని చేస్తాయి.
ఫ వైద్య రంగంలో హోమియో విప్లవం - డా.డి. మహాదేవరావు, సీనియర్ మెడికల్ ఆఫీసర్, కర్నూలు ప్రభుత్వ హోమియో డిస్పెన్సరీ
వైద్యరంగంలో హోమియో వైద్యం విప్లవం సృష్టిస్తుంది. జర్మనీకి చెందిన డా. హానిమన కన్న కల సంపూర్ణగా నెరవేరుతోంది. దీర్ఘకాలిక జబ్బులకు హోమియో మందులతో మెరుగైన చికిత్స అందించవచ్చు. జబ్బును ప్రాథమిక దశలో గుర్తించి హోమియో మందులు వాడితే త్వరగా నయమవుతుంది. ముఖ్యంగా జలుబు, స్కిన అలర్జీ, శ్వాసకోశ వ్యాధులకు హోమియోలో మంచి ఫలితం ఉంటుంది. ఉచిత హోమియో వైద్యాన్ని ప్రజలకు అందించడానికి ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా హోమియో డిస్పెన్సరీలను ఏర్పాటు చేసింది.
ఫ 39 ఏళ్లుగా ఉచిత సేవలు - డా. కే. భాస్కర్ రెడ్డి, హోమియోవైద్యుడు, దయల్బాగ్ రాధాస్వామి చారిటబుల్ హోమియో డిస్పెన్సరీ
కర్నూలులోని ధర్మపేటలో 1986 జూన 1 నుంచి దయల్బాగ్ రాధాస్వామి ఛారిటబుల్ హోమియో డిస్పెన్సరీ ద్వారా ప్రతి రోజు వంద మందికి సాయంత్రం 6 నుంచి 8 గంటలకు చికిత్స అందిస్తున్నాను. సీజనల్ వ్యాధులు, వడదెబ్బ, డెంగ్యూ జ్వరాలు, పిల్లల్లో జ్ఞాపకశక్తి పెంచడం, చికెనఫాక్స్ వంటి వ్యాధులకు ఉచిత హోమియో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి మందులు పంపిణీ చేస్తున్నాం. ప్రతి బుధవారం కర్నూలు ధర్మపేటలో పేదల ఇల్లిల్లూ తిరిగి ఉచితంగా హోమియో మందులు ఇస్తున్నా.
ఫ హోమియోతో మంచి పలితాలు - డా. శిరీషారెడ్డి, లైఫ్ హోమియోపతి, కర్నూలు
సైడ్ ఎఫెక్స్ట్ లేకుండా, దీర్ఘకాలిక మొండి వ్యాధులను హోమియో వైద్యంతో నయం చేయవచ్చు. ఇటీవల కాలంలో హోమియో వైద్యానికి ఆదరణ బాగా పెరిగింది. అల్లోపతి వైద్యంతో విసిగిన రోగులు ప్రత్యామ్నాయంగా హోమియో వైద్యం వైపు మొగ్గు చూపుతున్నారు. సోరియాసిస్, ఆస్తమా, అలర్జీ, థైరాయిడ్, షుగర్, బీపీ, సీవోపీడీ, కిడ్నీ రాళ్లు, హార్మోన్ల సమస్య, స్పాండిలైటిస్‌కు మెరుగైన చికిత్స పొందవచ్చు.