Swarnagudem: స్వర్ణగూడెం కల్వర్టు.. దాటాలంటే కష్టమే
ABN , Publish Date - Aug 21 , 2025 | 05:40 AM
ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం స్వర్ణవారిగూడెం సమీపంలో ఇటీవల రహదారి నిర్మాణ పనుల్లో..
జీలుగుమిల్లి, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం స్వర్ణవారిగూడెం సమీపంలో ఇటీవల రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా కల్వర్టును నిర్మించారు. పక్కా రోడ్డు పూర్తికాలేదు. తాజా వర్షాలకు ఆ ప్రాంతమంతా పూర్తిగా బురదమయమైంది. వాహనాలు కూరుకుపోతున్నాయి. బుధవారం ఇలా కట్టెల లోడుతో వచ్చిన ట్రాక్టరు బురదలో కూరుకుపోగా, రెండు జేసీబీల సాయంతో బయటికి తీశారు. ఇంతలో మరో మినీ వాహనం బురదలో కూరుకుపోయి చక్రాలు దిగబడ్డాయి. ట్రాక్టరుకు కట్టి బయటకు లాగారు. బస్సుల రాకపోకలకు వీల్లేకపోవడంతో.. తల్లిదండ్రులే తమ పిల్లలను ఎలాగోలా జంగారెడ్డిగూడెం స్కూళ్లకు తీసుకెళ్లారు.