Share News

Swachh Andhra Awards: 6న స్వచ్ఛాంధ్ర అవార్డులు ప్రదానం

ABN , Publish Date - Oct 04 , 2025 | 04:19 AM

రాష్ట్ర స్థాయిలో స్వచ్ఛాంధ్ర అవార్డులను సీఎం చంద్రబాబు విజేతలకు అందజేస్తారని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ ఎండీ...

Swachh Andhra Awards: 6న స్వచ్ఛాంధ్ర అవార్డులు ప్రదానం

అమరావతి, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర స్థాయిలో స్వచ్ఛాంధ్ర అవార్డులను సీఎం చంద్రబాబు విజేతలకు అందజేస్తారని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ ఎండీ బి.అనీల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ‘అనంతపురం జిల్లా స్వచ్ఛ జిల్లాగా ఎంపికైంది. రాష్ట్రస్థాయిలో 69మంది, జిల్లా స్థాయిలో 1,257 మంది... మొత్తంగా 1,326 మంది విజేతలకు బహుమతులు అందజేస్తాం. 3 లక్షల లోపు జనాభా ఉన్న పట్టణాల విభాగంలో గుంటూరు జిల్లాలోని మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌, తాడిపత్రి, బొబ్బిలి మున్సిపాలిటీలు అగ్రస్థానాల్లో నిలిచాయి. ఈ నెల 6న విజయవాడలో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహిస్తాం’ అని అనిల్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

Updated Date - Oct 04 , 2025 | 04:19 AM