Sanitation Awareness: స్వచ్ఛతకు ప్రోత్సాహం
ABN , Publish Date - Sep 02 , 2025 | 06:52 AM
స్వచ్ఛాంధ్ర మిషన్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా శానిటేషన్, పరిశుభ్రతను నిర్వహించే పలు శాఖలు, సంస్థలు, వ్యక్తులను ప్రోత్సహించి..
మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు స్వచ్ఛ అవార్డులు
అమరావతి, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): స్వచ్ఛాంధ్ర మిషన్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా శానిటేషన్, పరిశుభ్రతను నిర్వహించే పలు శాఖలు, సంస్థలు, వ్యక్తులను ప్రోత్సహించి.. ‘స్వచ్ఛాంధ్ర అవార్డులు-2025’ ప్రదానం చేయాలని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. స్వచ్ఛ సర్వేక్షణ్ తరహాలో రాష్ట్ర, జిల్లా స్థాయి అవార్డులు ఇవ్వాలని భావించింది. స్వచ్ఛాంధ్ర మిషన్‌లో చురుకుగా పనిచేసిన వారిని గుర్తించి ప్రోత్సహించేందుకు, పౌరుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు, పరిశుభ్రతను అలవాటు చేసేందుకు ఈ అవార్డులు ఇవ్వనున్నారు. అక్టోబరు 2న ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారు. ఈ అవార్డుల ఎంపిక ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్‌ను మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ సోమవారం ప్రకటించింది.