AP Govt: ఐపీఎస్ సునీల్‌కుమార్ సస్పెన్షన్ ఆరు నెలలు పొడిగింపు
ABN , Publish Date - Aug 27 , 2025 | 04:16 AM
సీఐడీ మాజీ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్‌కుమార్ సస్పెన్షన్‌ను రాష్ట్రప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అక్రమాలపై...
ఇంటర్నెట్ డెస్క్: సీఐడీ మాజీ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్‌కుమార్ సస్పెన్షన్‌ను రాష్ట్రప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అక్రమాలపై ఈ ఏడాది మార్చిలో ఆయన సస్పెండైన సంగతి తెలిసిందే. సస్పెన్షన్‌ను తాజాగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 వరకూ కొనసాగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఐడీ చీఫ్‌గా ఉంటూ ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశీ పర్యటనలు చేయడం, అగ్రిగోల్డ్ బాధితుల నిధులు దుర్వినియోగం, అప్పటి వైసీపీ ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలకు గురిచేయడం.. అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్నప్పుడు జరిగిన అవినీతి మొదలైనవి ఆయన్ను చుట్టుముట్టాయి. అగ్నిమాపక శాఖలో అవినీతిని విజిలెన్స్ నిగ్గు తేల్చగా.. అగ్రిగోల్డ్ బాధితుల సొమ్ము స్వాహాపై ఏసీబీ కేసు నమోదు చేసింది. మరోవైపు కస్టోడియల్ టార్చర్‌కు సంబంధించిన కేసు గుంటూరులోని నగరంపాలెం పోలీసు స్టేషన్లో నమోదైంది.