CJI Suryakant: సామాన్యుల కోసమే సుప్రీం కోర్టు
ABN , Publish Date - Dec 07 , 2025 | 05:34 AM
సుప్రీం కోర్టు అంటే సామాన్యుల కోసం అన్న గట్టి సందేశం పంపాలని భావిస్తున్నానని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు.
లీడర్‌షిప్ సమ్మిట్‌లో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్
న్యూఢిల్లీ, డిసెంబరు 6: సుప్రీం కోర్టు అంటే సామాన్యుల కోసం అన్న గట్టి సందేశం పంపాలని భావిస్తున్నానని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. సుప్రీం కోర్టులో సాధారణ వ్యక్తులు వేసే కేసులకు కూడా తగిన చోటు, సమయం ఉంటుందని స్పష్టం చేశారు. ఢిల్లీలో శనివారం జరిగిన హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేసుల పరిష్కారం విషయంలో అంచనావేయదగ్గ టైమ్‌లైన్, ఏకీకృత జాతీయ జ్యుడీషియల్ విధానం, పెండింగ్ కేసులపై త్వరిత నిర్ణయం తన తొలి ప్రాధాన్యాలు అని తెలిపారు. పేద వర్గాల ప్రజలకు న్యాయం అందించే విషయంలో వ్యాజ్యాల ఖర్చు తగ్గించడం కూడా తన ప్రాధాన్యాల్లో ఒకటన్నారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రతపై మాట్లాడుతూ, న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల అధికారాలు రాజ్యాంగంలో స్పష్టంగా పొందుపరిచారని చెప్పారు.