Petition Dismissal: ప్రచారానికి సుప్రీంకోర్టు వేదిక కాదు
ABN , Publish Date - Nov 11 , 2025 | 06:25 AM
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీరుపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
కేఏ పాల్ తీరుపై న్యాయస్థానం అసహనం
మెడికల్ కాలేజీల పీపీపీపై పిటిషన్ డిస్మిస్
న్యూఢిల్లీ, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీరుపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రచారానికి సుప్రీంకోర్టు వేదిక కాదని ఘాటుగా వ్యాఖ్యానించింది. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను నిర్మించాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ గత నెల 15న కేఏ పాల్ వేసిన పిటిషన్ సోమవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. పిటిషన్‌కు విచారణార్హత లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. మీడియాలో ప్రచారం కోసం పిటిషన్లు వేస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే హైకోర్టును ఆశ్రయించాలంటూ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.