Supreme Court: వివేకా హత్య కేసు విచారణ 16కు వాయిదా
ABN , Publish Date - Sep 10 , 2025 | 05:44 AM
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. సీబీఐ విజ్ఞప్తితో కేసును సుప్రీంకోర్టు..
గత విచారణలో సుప్రీంకోర్టు ప్రశ్నలపై అఫిడవిట్ దాఖలుకు సమయం కోరిన సీబీఐ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. సీబీఐ విజ్ఞప్తితో కేసును సుప్రీంకోర్టు ఈనెల 16కి వాయిదా వేసింది. గత విచారణ సందర్భంగా.. వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరమా? లేదా? నిందితుల కస్టోడియల్ విచారణ చేయాలా? వద్దా? నిందితుల్లో ఎంత మంది బెయిల్ రద్దు చేయాలో తెలియజేయాలని, ప్రతి అంశానికి సంబంధించి సమగ్ర వివరణ ఇవ్వాలని న్యాయస్థానం సీబీఐని ఆదేశించింది. అయితే మంగళవారం జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ సతీశ్ చంద్రశర్మ ధర్మాసనం ఎదుట కేసు విచారణకు రాగా.. అఫిడవిట్ దాఖలు చేయడానికి మరికొంత సమయం కావాలని సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కోరారు. ఆ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం కేసును సెప్టెంబరు 16న మధ్యాహ్నం 2 గంటలకు విచారిస్తామని తెలిపింది.