Anticipatory Bail: మోహిత్‌రెడ్డి ముందస్తు బెయిల్‌పై సుప్రీంకోర్టు విచారణ వాయిదా
ABN , Publish Date - Dec 02 , 2025 | 05:53 AM
మద్యం కుంభకోణం కేసులో నిందితుడుగా ఉన్న వైఎస్సార్ సీపీ నేత చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై...
న్యూఢిల్లీ, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో నిందితుడుగా ఉన్న వైఎస్సార్ సీపీ నేత చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు జనవరి 19కి వాయిదా వేసింది. ఈ పిటిషన్ సోమవారం జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. సీనియర్ న్యాయవాది అందుబాటులో లేని కారణంగా విచారణను రెండు వారాలకు వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఆ విన్నపాన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.