Illegal Sand Mining: ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీం విచారణ 19కి వాయిదా
ABN , Publish Date - Oct 30 , 2025 | 04:10 AM
జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాలపై విచారణను సుప్రీంకోర్టు నవంబరు 19కి వాయిదా వేసింది.
న్యూఢిల్లీ, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాలపై విచారణను సుప్రీంకోర్టు నవంబరు 19కి వాయిదా వేసింది. ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి జేపీ వెంచర్స్‌కు జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ) రూ.18 కోట్ల జరిమానా విధించడంతో.. ఆ సంస్థ 2023 మే 15న సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. న్యాయస్థానం ఆదేశాలతో నాటి అక్రమ తవ్వకాలకు సంబంధించిన సమగ్ర నివేదికను ప్రస్తుత ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అందజేసింది. పిటిషన్‌పై బుధవారం జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్‌సింగ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు విచారణను వాయిదా వేసింది.