Supreme Court: మద్యం నిందితుల బెయిల్ పిటిషన్లను విచారించండి
ABN , Publish Date - Oct 17 , 2025 | 05:30 AM
మద్యం కుంభకోణం కేసులో నిందితులు సజ్జల శ్రీధర్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, చాణక్య బెయిల్ పిటిషన్లపై విచారణ కొనసాగించాలని ట్రయల్ కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది.
శ్రీధర్, రాజ్ కసిరెడ్డి, చాణక్యల పిటిషన్లపై ట్రయల్ కోర్టుకు సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో నిందితులు సజ్జల శ్రీధర్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, చాణక్య బెయిల్ పిటిషన్లపై విచారణ కొనసాగించాలని ట్రయల్ కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. తాము తదుపరి ఆదేశాలిచ్చే వరకూ మద్యం కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై నిర్ణయం తీసుకోవద్దని ట్రయల్ కోర్టును హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పును శ్రీధర్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, చాణక్యలు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్లను గురువారం జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. బుధవారం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కేసులో ఇచ్చిన ఆదేశాలే ఈ కేసులకూ వర్తిస్తాయని ధర్మాసనం స్పష్టం చేసింది. కేసు మెరిట్ ఆధారంగా విచారించి నిర్ణయం తీసుకోవాలని ట్రయల్ కోర్టుకు న్యాయస్థానం సూచించింది.