Share News

Supreme Court: మహిళా రిజర్వేషన్లు మీరూ అమలు చేయాల్సిందే

ABN , Publish Date - Dec 19 , 2025 | 04:05 AM

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ బార్‌ కౌన్సిళ్లలోనూ మహిళా రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.

Supreme Court: మహిళా రిజర్వేషన్లు మీరూ అమలు చేయాల్సిందే

  • ఆంధ్ర, తెలంగాణ బార్‌ కౌన్సిళ్లకు సుప్రీం ఆదేశం

న్యూఢిల్లీ, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ బార్‌ కౌన్సిళ్లలోనూ మహిళా రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. మహిళా న్యాయవాదులకు 30 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు నోటిఫికేషన్‌లో స్పష్టంగా పొందుపరచాలని ఆదేశించింది. గతంలో తామిచ్చిన ఉత్తర్వులను ఈ మేరకు సవరించింది. దేశవ్యాప్తంగా అన్ని బార్‌ కౌన్సిళ్లలోనూ మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ న్యాయవాది ఎంజీ యోగమాయ గత ఏడాది ఆగస్టు 26న, తర్వాత ఇతరులు సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌(సివిల్‌) దాఖలు చేశారు. వాటిపై సుదీర్ఘ వాదనల అనంతరం ఈ నెల 8న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కృష్ణకాంత్‌, జస్టిస్‌ జాయ్‌మాల్య బాగ్చీతో కూడిన ధర్మాసనం తుదితీర్పు వెలువరించింది.

Updated Date - Dec 19 , 2025 | 04:06 AM