Supreme Court: పిన్నెల్లి సోదరుల ముందస్తు బెయిల్‌పై విచారణ వాయిదా
ABN , Publish Date - Nov 11 , 2025 | 06:02 AM
టీడీపీ నాయకుల హత్య కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను...
న్యూఢిల్లీ, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): టీడీపీ నాయకుల హత్య కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు మరోసారి వాయిదా వేసింది. ఏపీ ప్రభుత్వం నుంచి తగిన సూచనలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నందున వాయిదా వేయాలని సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా విజ్ఞప్తి చేశారు. ఆ విన్నపాన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. అప్పటి వరకు పిన్నెల్లి సోదరులకు గతంలో కల్పించిన మధ్యంతర రక్షణ కొనసాగుతుందని తెలిపింది. సోమవారం జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.