Share News

Supreme Court: బెయిల్‌ రద్దు పిటిషన్లపై విచారణ వాయిదా

ABN , Publish Date - Jul 29 , 2025 | 05:09 AM

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక నిందితులు ఏ2 సునీల్‌ యాదవ్‌, ఏ3 గజ్జల ఉమాశంకర్‌ రెడ్డిల బెయిల్‌ రద్దు పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

Supreme Court: బెయిల్‌ రద్దు పిటిషన్లపై విచారణ వాయిదా

  • వివేకా కేసులో సునీత పిటిషన్లపై సుప్రీంకోర్టు నిర్ణయం

న్యూఢిల్లీ, జూలై 28(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక నిందితులు ఏ2 సునీల్‌ యాదవ్‌, ఏ3 గజ్జల ఉమాశంకర్‌ రెడ్డిల బెయిల్‌ రద్దు పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. వీరి బెయిల్‌ రద్దు చేయాలని గతంలో వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. సోమవారం జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌, జస్టిస్‌ ఎన్‌ కోటీశ్వర్‌ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఎదుట ఇవి విచారణకు వచ్చాయి. అయితే.. ఈ కేసులో ఇతర నిందితుల బెయిల్‌ రద్దు పిటిషన్లపై సుప్రీంకోర్టులోనే విచారణ జరుగుతోందని, అన్ని పిటిషన్లు కలిపి ఒకేసారి విచారిస్తామని బెంచ్‌ తెలిపిందని న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఆ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం తదుపరి విచారణను సెప్టెంబరు 16కు వాయిదా వేసింది.

Updated Date - Jul 29 , 2025 | 05:11 AM