Justice Sudhanshu Dhulia: ఓబుళాపురం అక్రమ మైనింగ్‌పై సుప్రీం కమిటీ
ABN , Publish Date - Sep 20 , 2025 | 06:35 AM
ఓబుళాపురం మైనింగ్ వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. లీజు సరిహద్దులు గుర్తించి ఎంత మేరకు అక్రమ మైనింగ్ తవ్వకాలు జరిపారో...
జస్టిస్ సుధాంశు నేతృత్వంలో ఏర్పాటు
హద్దుల గుర్తింపు, అక్రమ తవ్వకాల విస్తీర్ణం,
ప్రభుత్వానికి జరిగిన నష్టంపై అంచనా
నివేదిక సమర్పణకు 3 నెలల గడువు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): ఓబుళాపురం మైనింగ్ వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. లీజు సరిహద్దులు గుర్తించి ఎంత మేరకు అక్రమ మైనింగ్ తవ్వకాలు జరిపారో తేల్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుధాంశు ధులియా నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడి న కమిటీని నియమించింది. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. కమిటీ మూడు నెలల్లోగా నివేదిక సమర్పించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. కేసు తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసింది.