పారదర్శక ఓటర్ల జాబితాకు సహకరించాలి
ABN , Publish Date - Dec 24 , 2025 | 12:29 AM
పెండింగ్ ఫార్మ్స్‌ను వేగవంతంగా పరిష్కరించి పారదర్శక ఓటర్ల జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీల ప్ర తినిధులు సహకరించాలని డీఆర్వో రామునా యక్ కోరారు.
డీఆర్వో రామునాయక్
రాజకీయ పార్టీల
ప్రతినిధులతో సమావేశం
నంద్యాల నూనెపల్లి, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : పెండింగ్ ఫార్మ్స్‌ను వేగవంతంగా పరిష్కరించి పారదర్శక ఓటర్ల జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీల ప్ర తినిధులు సహకరించాలని డీఆర్వో రామునా యక్ కోరారు. మంగళవారం ఆయన తమ ఛాంబర్‌లో ఓటర్ల జాబితా రూపకల్పనపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతి ని ధులతో సమావేశం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ పెండింగ్ ఫార్మ్స్ 6, 7, 8ను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యం గా ఓటర్ల జాబితాలలో అస్పష్టమైన ఫొటోలు, ఒకరి ఫొటోకు బదులు మరొకరి ఫొటో, మనుషులు లేని ఫొటోలను జనవరి 10వ తేదీ లోపు సవరించా ల ని రాష్ట్ర ఎన్నికల సం ఘం ఆదేశించిందన్నారు. ఎలక్ర్టోల్ ఓటర్ మ్యాపిం గ్‌ను కూడా పూర్తి చే స్తామని వివరించారు. అలాగే బుక్ ఏ కాల్ బీఎల్వో కార్యక్రమం ద్వా రా ఓటర్లకు ఎటువంటి సమస్య ఉన్న పబ్లిక్ గ్రీవెన్స పోర్టల్‌లో నమోదు చేసినట్లయితే నేరుగా బీఎల్వోలు సదరు నంబరుకు ఫోనచేసి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తున్నామన్నారు. రాజ కీయ పార్టీ ప్రతినిధులు మాట్లాడుతూ.. ఎన్నికలలో ఈవీఎం మిషన్లకు బదులుగగా బ్యాలెట్ పేపర్లను ఏర్పాటు చేయాలని, బీఎల్వోలు ఫీల్డ్ విజిట్ క్షుణ్ణంగా జరిపేలా చూడాలని డీఆర్వోకు నివేదిం చారు. సమావేశంలో బీఎస్పీ, ఆమ్ ఆద్మీ, సీపీఐ, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ పార్టీల ప్రతినిధులు కొట్టం శ్రీనివాసులు, ప్రదీప్, నరసింహులు, సయ్యద్ రియాజ్ బాషా, నరేంద్ర కుమార్ రెడ్డి, సాయిరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.