Kurnool District: సూపర్‌సిక్స్ సూపర్ హిట్
ABN , Publish Date - Aug 26 , 2025 | 05:29 AM
మహిళా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు.
కర్నూలు జిల్లా పత్తికొండలో భారీ ర్యాలీ.. వేలాదిగా తరలివచ్చిన మహిళలు
పత్తికొండ, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): మహిళా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలమేరకు రాష్ట్రంలో సూపర్‌సిక్స్ పథకాలు విజయవంతంగా అమలుచేయడంపై పత్తికొండలో ‘సూపర్ సిక్స్.. సూపర్ హిట్’ అంటూ సోమవారం సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. మహిళలు వేలాదిగా హాజరయ్యారు. పత్తికొండలోని టీటీడీ కల్యాణ మండపం నుంచి అంబేడ్కర్ కూడలివరకు సాగిన ఈ ర్యాలీలో వేలాదిమంది మహిళలు పాల్గొని చంద్రబాబుకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహాక కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.