Share News

సూపర్‌ సిక్స్‌... సూపర్‌ ఫ్లాప్‌: షర్మిల

ABN , Publish Date - Sep 11 , 2025 | 06:49 AM

సూపర్‌ సిక్స్‌... సూపర్‌ ఫ్లాప్‌ అయిందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. బుధవారం ఎక్స్‌లో ఆమె స్పందించారు. సూపర్‌ సిక్స్‌ హామీల్లో ఒక్కటైనా పూర్తిగా అమలు చేశారా..

సూపర్‌ సిక్స్‌... సూపర్‌ ఫ్లాప్‌:  షర్మిల

అమరావతి, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): సూపర్‌ సిక్స్‌... సూపర్‌ ఫ్లాప్‌ అయిందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. బుధవారం ఎక్స్‌లో ఆమె స్పందించారు. ‘ సూపర్‌ సిక్స్‌ హామీల్లో ఒక్కటైనా పూర్తిగా అమలు చేశారా? రాష్ట్రంలోని 50 లక్షల మంది నిరుద్యోగుల్లో ఒక్కరికైనా రూ.3,000 చొప్పున ప్రతినెలా నిరుద్యోగ భృతి ఇస్తున్నారా? ఇస్తానన్న 20 లక్షల ఉద్యోగాలెక్కడ? స్థాపించని పరిశ్రమలతో అగ్రిమెంట్లు చేసుకున్నంత మాత్రాన ఉద్యోగాలు ఇచ్చేసినట్లేనా? ఒక్కరికీ భృతి ఇవ్వకుండా, ఉద్యోగం ఇవ్వకుండా సూపర్‌ సిక్స్‌ ఎలా సక్సెస్‌ అవుతుంది? కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలల్లో ఒక్క మహిళైనా నెలకు రూ.1,500 పొందారా? 14 నెలల తర్వాత ఫ్రీ బస్సును అమలు చేసి.. సూపర్‌ సక్సెస్‌ అంటే ప్రజలు నవ్వుతున్నారు. గోరంత చేసి కొండంత చెప్పుకోవడం నిజంగా కూటమి ప్రభుత్వానికే చెల్లుతుంది. ప్రతియేటా జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌, విద్యుత్తు చార్జీలు తగ్గింపు, జర్నలిస్టులకు ఉచిత నివాస స్థలం లాంటి మ్యానిఫెస్టోలో పేర్కొన్న ప్రధాన హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా? ’ అని షర్మిల ప్రశ్నించారు.

Updated Date - Sep 11 , 2025 | 06:50 AM