Payyavula Keshav: చరిత్రలో నిలిచేలా సూపర్ సిక్స్ సభ
ABN , Publish Date - Sep 09 , 2025 | 05:18 AM
చరిత్ర లో నిలిచిపోయేలా ‘సూపర్‌సిక్స్-సూపర్ హిట్’ సభ జరుగుతుందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.
కడప మహానాడును మించి నిర్వహిస్తాం: పయ్యావుల
అనంత సభ వేదిక ఏర్పాట్ల పరిశీలన
అనంతపురం క్రైం, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): చరిత్ర లో నిలిచిపోయేలా ‘సూపర్‌సిక్స్-సూపర్ హిట్’ సభ జరుగుతుందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అనంతపురం శివారులోని జీఎంఆర్ ఇంద్రప్రస్థ గ్రౌండ్స్‌లో బుధవారం జరిగే ఈ సభ ఏర్పాట్లను డీజీపీ హరీశ్‌కుమా ర్ గుప్తా సోమవారం పయ్యావులతోపాటు మంత్రులు అనగాని సత్యప్రసాద్, నారాయణ, గొట్టిపాటి రవికుమార్, రాంప్రసాద్‌రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరా వు, ఎమ్మెల్యేలు దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్, ఎంఎస్ రా జు తదితరులతో కలిసి పరిశీలించారు. పయ్యావుల మీడియాతో మాట్లాడారు. మొన్న కడపలో జరిగిన మహానాడు బహిరంగ సభ అద్భుతం అనుకుంటే.. అంతకు మించిన ఏర్పాట్లు అనంతలో చేస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభు త్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల వాగ్దానాలన్నీ అమలు చేశామన్నారు. సూపర్ సిక్స్-సూపర్ హిట్ సభ.. కృతజ్ఞతా సభ అని.. దీనికి తరలిరావాలని టీడీపీ కార్యకర్తలు గ్రా మాల్లో ఇంటింటికీ తిరిగి పిలుస్తున్నారని, ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. సభను విజయవంతం చేయడానికి జనసేన, బీజేపీ, టీడీపీ కలసి పనిచేస్తున్నాయని అన్నారు. సూపర్ సిక్స్ హామీలతోపాటు రాయలసీమకు కీలకమైన హంద్రీ-నీవా కాలువ విస్తరణ పనులను 100 రోజుల్లో పూర్తిచేశామని, రెట్టింపు నీటిని తీసుకురావడంతో సీమ రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోందని తెలిపా రు. సభలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, లోకేశ్‌తోపాటు రాష్ట్ర, కేంద్ర మంత్రులు, కూటమి పార్టీల నాయకులు, శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొంటారు. కాగా.. భద్రతా ఏర్పాట్లను డీజీపీ క్షేత్రస్థాయిలో సమీక్షించారు. భదత్రా ఏర్పాట్లపై ఎస్పీ జగదీశ్ వివరించారు.
హ్యాండ్సమ్ డీజీపీ.. పయ్యావుల చలోక్తి
‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’ సభ భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు డీజీపీ అనంతపురం వచ్చారు. యూనిఫాంలో కాకుండా సివిల్ డ్రస్‌లో ఆయన సభావేదిక వద్ద కు రావడంతో మంత్రులు తొలుత గుర్తించలేకపోయారు. పయ్యావుల కేశవ్ మాత్రం గుర్తుపట్టి పలకరించారు. ‘రెవెన్యూ మంత్రిగారూ చూడండి.. హ్యాండ్సమ్ డీజీపీ.. గుర్తు పట్టారా.. అని నవ్వుతూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో అన్నారు. దీంతో ఆయన డీజీపీతో కరచాలనం చేశారు. ‘డీజీపీ గారు మామూలుగానే హ్యాండ్సమ్.. ఈ రోజు కలర్‌ఫుల్‌గా ఉన్నారు. గుర్తుపట్టకుండా ఉంటామా’ అని వ్యాఖ్యానించారు.