AICC Spokesperson: త్వరలో విశాఖ ఉక్కుకు రాహుల్
ABN , Publish Date - Dec 04 , 2025 | 05:54 AM
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ త్వరలో విశాఖ ఉక్కును సందర్శించనున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి సునీల్ అహీరా వెల్లడించారు.
అది కోహినూర్ వజ్రం... దానిని అదానీకి అమ్మేస్తోంది: సునీల్ అహీరా
మహారాణిపేట(విశాఖపట్నం), డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ త్వరలో విశాఖ ఉక్కును సందర్శించనున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి సునీల్ అహీరా వెల్లడించారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘విశాఖ స్టీల్ కోహినూర్ వజ్రం వంటిది. ఇందిరమ్మ ఇచ్చిన స్టీల్ ప్లాంటును బీజేపీ తన కార్పొరేట్ మిత్రుడు అదానీకి అమ్మేస్తోంది. స్టీల్‌ప్లాంటును అమ్మనివ్వబోము’ అని పేర్కొన్నారు.