భక్తిశ్రద్ధలతో మట్టల ఆదివారం
ABN , Publish Date - Apr 14 , 2025 | 12:12 AM
మండలంలోని ఆయా గ్రామాల్లో మట్టల ఆదివారాన్ని క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు.

చాగలమర్రి ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఆయా గ్రామాల్లో మట్టల ఆదివారాన్ని క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. ఈస్టర్‌కు ముందు ఆదివారాన్ని క్రైస్తవులు ఈత మట్టలను చేత పట్టుకొని చర్చిల వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చాగలమర్రి ఆర్‌సిఎం, సీఎస్‌ఐ మార్తోమా, పెద్దబోదనం మద్దురు, ముత్యాలపాడు, గోడిగెనూరు తదితర గ్రామాలలో మట్టల ఆదివారం పండుగను జరుపుకొన్నారు. ఆయా చర్చిలలో ఫాదర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పండుగ విశిష్ఠతను తెలియజేశారు.
రుద్రవరం: మండలంలోని పెద్దకంబలూరు, కోటకొండ, చిన్నకంబ లూరు, మందలూరు, నరసాపురం, రుద్రవరం గ్రామాల్లో క్రైస్తవులు చర్చి ల్లో మట్టల ఆదివారాన్ని నిర్వహించారు. ఈత మట్టలు పట్టుకొని ర్యాలీలు నిర్వహించారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
సంజామల: నొస్సం గ్రామంలో క్రైస్తవులు ఆదివారం ఘనంగా మట్టల పండుగ జరుపుకున్నారు ఉదయాన్నే పాస్టర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మట్టలతో గ్రామంలో ర్యాలీ నిర్వహించి చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో క్రైస్తవులు పాల్గొన్నారు.
కోవెలకుంట్ల: పట్టణంలోని క్రైస్తవులు మట్టల ఆదివారాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మట్టలు చేతపట్టుకొని చర్చి చుట్టూ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం క్రైస్తవులు చర్చిల్లో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ఆర్సీఎం, సీఎస్‌ఐ చర్చిల్లో క్రైస్తవులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.