Sudha Murthy: మాతృభాషపై చిన్నచూపు తగదు
ABN , Publish Date - Dec 15 , 2025 | 04:22 AM
లక్ష్య సాధనలో మన మనసును ఇతర ప్రభావాల నుంచి దూరం చేసుకోవడానికి నిరంతరం కృషి, సాధన చేయాలని రాజ్యసభ సభ్యురాలు, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధామూర్తి సూచించారు.
ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధామూర్తి
రాజాం/రూరల్, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): ‘లక్ష్య సాధనలో మన మనసును ఇతర ప్రభావాల నుంచి దూరం చేసుకోవడానికి నిరంతరం కృషి, సాధన చేయాలని రాజ్యసభ సభ్యురాలు, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధామూర్తి సూచించారు. విజయనగరం జిల్లా రాజాంలోని జీఎంఆర్ ఐటీ ప్రాంగణంలో ఆదివారం జీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పట్టు సాధించాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీషుపై పట్టు సాధించాలన్నారు. అదే సమయంలో మాతృభాషపై చిన్నచూపు తగదని చెప్పారు. మాతృభాష, ఆంగ్లభాష శ్రీకృష్ణుడి ఇద్దరు తల్లులైన దేవకి, యశోద వంటివన్నారు. ఈ రెండు మనలోని వ్యక్తిత్వాన్ని తీర్చుదిద్దుతాయని తెలిపారు. కార్యక్రమంలో జీఎంఆర్ గ్రూపు సంస్థల చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఆదిత్యుడి సన్నిధిలో సుధామూర్తి
శ్రీకాకుళం జిల్లా అరస వల్లిలో ఆదిత్యుడిని ఆది వారం ఇన్ఫోసిస్ వ్యవ స్థాపక అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు సుధా నారాయ ణమూర్తి దర్శించుకున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంథి మల్లిఖార్జునరావు కుమార్తె బి.రమాదేవి, జీఎంఆర్ బిజినెస్ చైర్మన్ బి.వి.నాగేశ్వరరావుతో కలిసి స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. అనివెట్టి మండపంలో పండితులు వేదాశీర్వచనాలు అందజేశారు. వారికి ఆదిత్యుడి స్వామి చిత్రపటం జ్ఞాపికను, ప్రసాదాన్ని ఈవో కేఎన్‌వీడీవీ ప్రసాద్ అందజేశారు. అలాగే శ్రీకూర్మంలోని కూర్మనాథుడ్ని కూడా సుధానారాయణమూర్తి దర్శించుకుని పూజలు చేశారు.