Share News

టీడీపీ నాయకుడి ఇంట్లో నాసిరకం పత్తి విత్తనాలు

ABN , Publish Date - Jun 05 , 2025 | 11:27 PM

మంత్రాలయం మండలం మాజీ జడ్పీటీసీ ఆర్‌. లక్ష్మయ్య ఇంట్లో భారీగా నాసిరకం పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి.

   టీడీపీ నాయకుడి ఇంట్లో నాసిరకం పత్తి విత్తనాలు

విజిలెన్స అధికారుల దాడులు

165 కేజీల లూజు పత్తి విత్తనాలు స్వాధీనం

కేసు నమోదు

మంత్రాలయం, జూన 5 (ఆంధ్రజ్యోతి): మంత్రాలయం మండలం మాజీ జడ్పీటీసీ ఆర్‌. లక్ష్మయ్య ఇంట్లో భారీగా నాసిరకం పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. గురువారం కర్నూలు రీజనల్‌ విజిలెన్స అండ్‌ ఎనఫోర్స్‌మెంటు అధికారి విశ్వనాథ్‌, భరత మాజీ జడ్పీటీసీ ఇంట్లో సోదాలు చేసి నాలుగు బస్తాల్లో ఉన్న నాసిరకం పత్తి విత్తనాలను పట్టుకున్నారు. దాదాపు వీటి విలువ రూ.1.65 లక్షలు ఉండవచ్చని అంచనా వేశారు. స్థానిక మండల ఏవో జీర గణేష్‌, వీఆర్వో ప్రభాకర్‌, వీఆర్‌ఏ ఈరన్న పంచనామా చేశారు. అధికార పార్టీ నాయకుడి ఇంట్లో భారీగా లూజు నాసిరకం పత్తి విత్తనాలు లభ్యమైన ఘటనలో నియోజకవర్గ స్థాయి నాయకుల ఒత్తిడితో కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. లక్ష్మయ్య ఇంట్లో ఉన్న పత్తి విత్తనాలు ఆయన అన్న గోపాల్‌ కుమారుడు నాగమల్లేష్‌ పేరుతో ఉన్నట్లు కేసు నమోదు చేశారు. మూడు నిండు బస్తాలు, ఒక సగం బస్తాల్లోని 165 కేజీల నాసిరకం పత్తి విత్తనాలు మార్కెట్‌లో దాదాపు రూ.3 లక్షల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. రైతు తాను పండించిన విత్తనాలను కంపెనీలకు విక్రయించి కొంత విత్తనాలు స్థానిక రైతులకు విత్తనాలు కోరడంతోనే ఇంట్లో నిల్వ ఉంచి రైతులకు స్వచ్ఛందంగా అందిస్తున్నామని రైతు నాగమల్లేష్‌ పేర్కొంటున్నారు. ఈ పట్టుబడిన విత్తనాలు నకిలీవా..? అసలైన విత్తనాలా? అనేదానిపై ల్యాబ్‌కు పంపించి నిర్ధారణ చేస్తామని విజిలెన్స అధికారి విశ్వనాథ్‌, మండల ఏవో జీర గణేష్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు లైసెన్సు విత్తనాలు అందించేందుకు ప్రోత్సహిస్తుండగా.. అధికార పార్టీకి చెందిన నాయకుడే నాసిరకం విత్తనాలు తన ఇంట్లో పెట్టుకుని విక్రయిస్తుండటం నియోజకవర్గంలోనే చర్చనీయంశంగా మారింది. 165 కేజీల విత్తనాలను స్వాదీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ దాడుల్లో వీఏఏలు మదార్‌, దినేష్‌ ఉన్నారు.

Updated Date - Jun 05 , 2025 | 11:27 PM