Share News

Farmer Awareness: పంటల బీమాపై రైతులకు విశ్వాసం కల్పించండి

ABN , Publish Date - Sep 25 , 2025 | 06:50 AM

జీవిత బీమా రంగంలో వస్తున్న మార్పులు, పంటల బీమా పట్ల రైతులకు అవగాహన కల్పించడం గురించి లోక్‌సభ సబార్డినేట్‌ లెజిస్లేషన్‌ కమిటీ సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది.

Farmer Awareness: పంటల బీమాపై రైతులకు విశ్వాసం కల్పించండి

  • బీమా కంపెనీలకు లోక్‌సభ సబార్డినేట్‌ లెజిస్లేషన్‌ కమిటీ సూచన

  • రెండో రోజు బీమా రంగంపై చర్చించిన కమిటీ

అమరావతి, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): జీవిత బీమా రంగంలో వస్తున్న మార్పులు, పంటల బీమా పట్ల రైతులకు అవగాహన కల్పించడం గురించి లోక్‌సభ సబార్డినేట్‌ లెజిస్లేషన్‌ కమిటీ సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. విజయవాడలో మంగళవారం ప్రారంభమైన ఈ సమావేశాల్లో రెండో రోజైన బుధవారం బీమా రంగంపై చర్చ జరిగింది. లెజిస్లేషన్‌ కమిటీ అధ్యక్షుడు, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి అధ్యక్షతన ఈ సమావేశాలు జరుగుతున్నాయి. రైతులకు ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన పథకం, రీస్ట్రక్చర్డ్‌ వెదర్‌ బేస్డ్‌ పంటల బీమా పథకం అమలు చేసే విధానాల గురించి సభ్యులు బీమా కంపెనీల చైర్మన్లు, డైరెక్టర్లతో మాట్లాడారు. రైతులకు పంటల బీమా పట్ల తగిన విశ్వాసం ఏర్పడే విధంగా తీసుకోవాల్సిన చర్యల గురించి, బీమా కంపెనీల మధ్య ఆరోగ్యకరమైన పోటీ గురించి, ప్రస్తుత జీఎస్టీ తగ్గింపుల గురించి కూడా చర్చించారు. సమావేశంలో కమిటీ సభ్యులైన ఎంపీలు ప్రేమచంద్రన్‌, మొహహ్మద్‌ జావేద్‌, వివేక్‌ ఠాకూర్‌, రాజేశ్‌ వర్మతోపాటు భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ చైర్మన్‌ అజయ్‌ సేథ్‌, దేశంలోని ప్రముఖ బీమా కంపెనీలైన ఎల్‌ఐసీ, నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలతో పాటు పలు సంస్థల చైర్మన్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు.

Updated Date - Sep 25 , 2025 | 06:52 AM