అబ్బురపరచిన దసరా సంబరాలు
ABN , Publish Date - Oct 03 , 2025 | 11:49 PM
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల చివరిరోజైన విజయదశమి చివరి రోజు సంబ రాలు ప్రజలను అబ్బురపరచాయి.
ప్రొద్దుటూరు/జమ్మలమడుగు, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): దసరా శరన్నవరాత్రి ఉత్సవాల చివరిరోజైన విజయదశమి చివరి రోజు సంబ రాలు ప్రజలను అబ్బురపరచాయి. తొట్ల మెర వణిలో అమ్మవారు గ్రామోత్సవంలో భక్తులను కటాక్షించారు. ప్రొద్దుటూరు, జమ్మలమడుగులలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 11 రోజులుగా వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వాసవీ కన్యకాపరమేశ్వరీదేవి అమ్మవారికి శమీ దర్శనం, శ్రీవాసవాంబ దేవిగ్రామోత్సవం నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం వసంతోత్సవం, వైశ్య సమాఽరాధాన తొట్లోత్సవం, పాన్పు సేవా కార్యక్రమాలు వైభ వంగా నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా ప్రొద్ద టూరు అమ్మవారిశాలలో అమ్మవారి ఉత్సవమూర్తిని శోభాయమానంగా బంగారు ఆభరణాలు, పట్టువస్త్రాలు, పూలమాలలతో ఊరేగింపుగా కొర్రపాడు రోడ్డులోని వాసవీ శమీ వృక్ష మండపంలో శమీ దర్శనం చేయించారు. పాత మార్కెట్‌లోని చెన్నకేశవస్వామి ఆలయం, వైఎంఆర్ కాలనీలోని రాజరాజేశ్వరీదేవి ఆలయం, శివాలయం, చౌడేశ్వరీదేవి ఆలయం, ముక్తిరామలింగేశ్వరస్వామి ఆలయం, సత్యనారాయణస్వామి ఆలయం, ఆత్మారామస్వామి ఆలయాల నిర్వాహకులు అమ్మవారికి శమీ వృక్ష దర్శనం చేయించారు. భక్తుల జనసందోహంతో పాలిటెక్నిక్ కళాశాల వద్ద నుంచి శివాలయం వరకు కిక్కిరిసిపోయింది.
మైదుకూరు రూరల్‌లో :మైదుకూరులో దసరా ఉత్సవాలను నిర్వాహకులు అంగరంగ వైభవం గా నిర్వహించారు. గురువారం సాయంత్రం శమీ దర్శనం కోసం స్థానిక నంద్యాల రోడ్డులోని జమ్మి చెట్టు వద్దకు అమ్మవారిశాల నుంచి అమ్మవారితో ఊరేగింపుగా వెళ్లారు. ఈ ఊరేగిం పులో కోలాటం, బాణసంచా, బ్యాండు మేళాలతో మైదుకూరు పట్టణం మురిసిపోయింది.
దువ్వూరులో: దువ్వూరులో గురువారం దసరా వేడుకలను వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని ఘనంగా ఊరేగించారు. భక్తులు దర్శనం చేసుకుని పునీతులయ్యారు.
బద్వేలుటౌనలో : పట్టణంలో విజయదశమి సందర్భంగా గురువారం వాసవీమాత శమీ దర్శనం, తొట్టిమెరవని కన్యకాపరమేశ్వరి ఆల యం, కోదండరామాలయం, మహాలక్ష్మీదేవి ఆల యం, భద్రకాళీసమేత వీరభద్రస్వామి ఆలయం, కనక దుర్గమ్మ ఆలయంలోని అమ్మవారి విగ్రహా లను ప్రత్యేక అలంకరణ చేసి గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం ఆలయకమిటీవారు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.