ఇష్టంతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
ABN , Publish Date - Aug 29 , 2025 | 11:41 PM
ప్రతి విద్యార్థి ఇష్టంతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రాయలసీమ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ అన్నారు.
రాయలసీమ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్
బాలభారతి పాఠశాలకు రూ.10లక్షల విరాళం
ఘనస్వాగతం పలికిన పొదుపు మహిళలు, విద్యార్థులు
ఓర్వకల్లు, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): ప్రతి విద్యార్థి ఇష్టంతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రాయలసీమ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ అన్నారు. మండలంలోని పొదుపులక్ష్మి ఐక్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలభారతి పాఠశాలలో చదువు తున్న తల్లిదండ్రులు లేని పిల్లలకు తానా బోర్డు ఆఫ్ డైరెక్టర్, కర్నూలు ఎనఆర్‌ఐ ఫౌండేషన చైర్మన పొట్లూరు రవి ఆధ్వర్యంలో ఆపాఠశాలకు రూ.10లక్షల విరాళాన్ని శుక్రవారం అందజేశారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా డీఐజీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వీరికి పొదుపు మహిళలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. పాఠశాలలో ఏర్పా టుచేసిన వినాయకుడికి, వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా డీఐజీ మాట్లాడుతూ విద్యార్థులకు పొదుపులక్ష్మి మండల ఐక్యసంఘం పాఠశాల భవనం కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా పొదుపులక్ష్మి మండల సమాఖ్య గౌరవ సలహాదారురా లు విజయభారతిని ఆయన అభినందించారు. పొట్లూరు రవి పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు అందిస్తున్న సహాయం మరువరానిదన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన కోఆర్డినేటర్ ముప్పా రాజశేఖర్, కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్, రూరల్ సీఐ చంద్రబాబు నాయుడు, ఎస్‌ఐ సునీల్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ నవ్య, పొదుపులక్ష్మి సంఘం సభ్యులు పాల్గొన్నారు.
విద్యార్థులు ఎలాంటి ఆటంకాల్లేకుండా చదువుకోవాలి
అనాథ విద్యార్థుల ఎలాంటి ఆటంకాలు లేకుండా చదువుకోవాలనే ఉద్దేశంతో విరాళాన్ని అందిస్తున్నట్లు పొట్లూరు రవి అన్నారు. ప్రతి సంవత్సరం రూ.10లక్షల చొప్పున పాఠశాల యజమాన్యానికి ఐదేళ్లుగా విరాళాన్ని అందిస్తున్నామన్నారు. లాభాపేక్ష లేకుండా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉత్తమ విద్యను అందిస్తున్న బాలభారతి పాఠశాలకు భవిష్యత్తులో కూడా తమ వంతు సహకారం అందజేస్తామని పలువురు ఎనఆర్‌ఐలు ఈ కార్యక్రమానికి తోడ్పాటు అందిస్తున్నారని, వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. పొదుపు సంఘం మహిళలు శ్రమశక్తితో నిర్మించుకున్న బాలభారతి పాఠశాల మహిళా శక్తికి నిదర్శనమని పొదుపు మహిళలను అభినందించారు. ఎనఆర్‌ఐలు సామాజిక సేవా కార్యక్రమాల్లో తమ వంతు పాత్ర పోషించడంతో వారిని విజయభారతి అభినందించారు.