Share News

Visual Impairment: దృష్టిలోపం ఉన్నా ఇంటర్‌లో సైన్స్‌ చదవొచ్చు

ABN , Publish Date - Sep 05 , 2025 | 06:36 AM

దృష్టిలోపం ఉన్న విద్యార్థులు ఇకపై ఇంటర్మీడియట్‌లో సైన్స్‌ గ్రూపులు తీసుకుని చదవొచ్చు. సైన్స్‌ గ్రూపుల్లో ప్రాక్టికల్స్‌ చేయలేరు కాబట్టి...

Visual Impairment: దృష్టిలోపం ఉన్నా  ఇంటర్‌లో సైన్స్‌ చదవొచ్చు

అమరావతి, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): దృష్టిలోపం ఉన్న విద్యార్థులు ఇకపై ఇంటర్మీడియట్‌లో సైన్స్‌ గ్రూపులు తీసుకుని చదవొచ్చు. సైన్స్‌ గ్రూపుల్లో ప్రాక్టికల్స్‌ చేయలేరు కాబట్టి వారికి ఇంతవరకూ ఆ అవకాశం ఇవ్వలేదు. జాతీయ విద్యాసంస్థలు, సీబీఎ్‌సఈలో దృష్టిలోపం ఉన్న వారినీ సైన్స్‌ గ్రూపుల్లో చేర్చుకుంటున్నారని, తమకూ అవకాశం కల్పించాలని అనేక మంది రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై సమీక్ష నిర్వహించిన మంత్రి లోకేశ్‌ వారికీ అవకాశం కల్పించాలని ఆదేశించారు. అందుకు అనుగుణంగా ఇంటర్‌ విద్యాశాఖ ఈ విద్యా సంవత్సరం నుంచే వారిని సైన్స్‌ గ్రూపుల్లోకి అనుమతించింది.

Updated Date - Sep 05 , 2025 | 06:36 AM