స్కూల్ బస్సు కిందపడి విద్యార్థిని మృతి
ABN , Publish Date - Jul 04 , 2025 | 11:39 PM
kurnool news
ఆళ్లగడ్డ, జూలై 4 (ఆంధ్రజ్యోతి): స్కూల్ బస్సు కింద పడి ఓ విద్యార్థిని మృతి చెందింది. ఈ హృదయ విదారక ఘటన పట్టణంలో ఎంవీనగర్ కాలనీలో చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వివరాలు.. కాలనీలోని శ్రీ కీర్తన పాఠశాలలో హరిప్రియ(4)ను తల్లిదండ్రులు శ్రీధర్, వనజ శుక్రవారం ఉదయం నర్సరీలో చేర్పించారు. పాఠశాల ముగిసిన అనంతరం బస్సు దిగి ఇంటికి వెళ్తుండగా బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడిపాడు. హరిప్రియ బస్సు టైర్ల కిందపడి అక్కడికక్కడే మృతిచెందింది. పాఠశాలలో చేరిన రోజే చిన్నారి మృత్యువాత పడటంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. సంఘటన జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ పరారయ్యాడు. విషయం తెలిసిన వెంటనే పట్టణ సీఐ యుగంధర్, ఎస్‌ఐ నగీనా, సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేశారు.