Share News

Wrong Route: ప్రమాదాలు జరుగుతున్నా పట్టదా

ABN , Publish Date - Nov 05 , 2025 | 06:10 AM

అన్నీ ‘సెవెన్‌’ సీటర్‌ ఆటోలు! కానీ.. ఒక్కో ఆటోలో పరిమితికి మించి.. కిక్కిరిసిన విద్యార్థులు! రయ్య్‌మని వెళుతున్నది రాంగ్‌ రూట్‌లో! అందులోనూ..

 Wrong Route: ప్రమాదాలు జరుగుతున్నా పట్టదా

అన్నీ ‘సెవెన్‌’ సీటర్‌ ఆటోలు! కానీ.. ఒక్కో ఆటోలో పరిమితికి మించి.. కిక్కిరిసిన విద్యార్థులు! రయ్య్‌మని వెళుతున్నది రాంగ్‌ రూట్‌లో! అందులోనూ.. జాతీయ రహదారిపై! జరగరాని ఘోరం జరిగితే ఎలా? రాంగ్‌ రూట్‌లో దూసుకెళ్లే ‘ప్రాణాల’కు పూచీ ఎవరిది? కర్నూలు జిల్లా ఓర్వకల్లు నుంచి నంద్యాల వైపు వెళ్లేందుకు ఒక కిలోమీటరు దూరం వెళ్లి... రాక్‌ గార్డెన్‌ వద్ద యూటర్న్‌ తీసుకోవాలి. కానీ.. విద్యార్థులను తీసుకెళ్లే ఆటోలు, వాహనాలు దాదాపు అర కిలోమీటరు మేర రాంగ్‌రూట్‌లో వెళ్లి, హైవేలో అటువైపు కలుస్తున్నాయి. జైరాజ్‌ ఇస్పాత్‌ స్టీల్‌ప్లాంట్‌కు ముడి సరుకును సరఫరా చేసే భారీ వాహనాలదీ ఈ ‘తప్పుడు’ దారే! ఇదో నిత్య కృత్యం! ఈ వాహనాలు పోలీసు స్టేషన్‌ ముందు నుంచే రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నా పట్టించుకునే వారు లేరు. వరుస ప్రమాదాల్లో పెద్దసంఖ్యలో ప్రాణాలు పోతున్నా అప్రమత్తత కనిపించడం లేదు.

- ఓర్వకల్లు, ఆంధ్రజ్యోతి

Updated Date - Nov 05 , 2025 | 06:13 AM