యువత ఉపాధి అవకాశాల కోసం కృషి
ABN , Publish Date - Sep 23 , 2025 | 11:53 PM
రాష్ట్రంలోని యువతకు ఉపాధి కల్పించండమే ద్యేయంగా పని చేస్తున్నామని ఎపీఐడీసీ డైరెక్టర్ పం దిటి మల్హోత్ర తెలిపారు.
మైదుకూరు రూరల్,సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోని యువతకు ఉపాధి కల్పించండమే ద్యేయంగా పని చేస్తున్నామని ఎపీఐడీసీ డైరెక్టర్ పం దిటి మల్హోత్ర తెలిపారు. ఏపీ సచివా లయంలో మంగళవారం ఏపీఐడీసీ ఎండీ రఘునాధ్‌తో మైదుకూరుకు చెం దిన రాష్ట్ర ఏపీఐడీసీ డైరెక్టర్ మల్హోత్ర తో పాటు మరికొందరు డైరెక్టర్లు రాష్ట్ర పారిశ్రమికశాఖ మంత్రి టీజీ భరత్‌తో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో రాషా్ట్రనికి కొత్త పరిశ్రమల ద్వారా యువతకు ఉపాధి కల్పించాలని, అందుకు డైరెక్టర్ల అందరూ కృషి చేయాలని మంత్రిని కోరినట్లు మల్హోత్ర తెలిపారు.