Share News

Agriculture Director: ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

ABN , Publish Date - Jun 07 , 2025 | 03:33 AM

ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో రసాయన ఎరువులను ఎమ్మార్పీ కన్నా అధిక ధరకు విక్రయిస్తే.. డీలర్ల లైసెన్సులు రద్దు చేసి, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ డిల్లీరావు...

Agriculture Director: ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

  • వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ డిల్లీరావు హెచ్చరిక

అమరావతి, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో రసాయన ఎరువులను ఎమ్మార్పీ కన్నా అధిక ధరకు విక్రయిస్తే.. డీలర్ల లైసెన్సులు రద్దు చేసి, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ డిల్లీరావు శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. రైతులు తప్పనిసరిగా రశీదు తీసుకోవాలని సూచించారు. నానో యూరియా, నానో డీఏపీ అందుబాటులో ఉన్నాయన్నారు. ఖరీఫ్‌ సీజన్‌కు 16.76లక్షల టన్నుల ఎరువులు అవసరమైతే, ప్రస్తుతం 9.09 లక్షల టన్నులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

Updated Date - Jun 07 , 2025 | 03:35 AM