నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు
ABN , Publish Date - May 21 , 2025 | 12:17 AM
నకిలీ ఎరువులు, మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ జిల్లా అధికారి మురళీకృష్ణ హెచ్చరించారు.
జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణ
డోన రూరల్, మే 20 (ఆంధ్రజ్యోతి): నకిలీ ఎరువులు, మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ జిల్లా అధికారి మురళీకృష్ణ హెచ్చరించారు. మంగళవారం పట్టణంలోని ఆర్‌అండ్‌బీ గెస్టు హౌస్ సమావేశ భవనంలో డోన వ్యవసాయ శాఖ ఏడీఏ అశోక్‌వర్ధన రెడ్డి ఆధ్వర్యంలో ఎరువులు, పురుగుల మందు, విత్తనాలు అమ్మే డీలర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయాధి కారి మురళీకృష్ణ మాట్లాడుతూ రాబోవు ఖరీఫ్‌లో ఎటువంటి నకిలీ విత్తనాలు, ఎరువులు, నకిలీ పురుగు మందులు విక్రయించడానికి వీల్లేదని, అటువంటి వారిపై పూర్తిగా నిఘా ఉంచామని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సరైన ధరలకు సరైన మందుల ను, ఎరువులను విత్తనాలను విక్రయించాలన్నారు. లేనిపక్షంలో చట్టపర మైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా వ్యవ సాయాధికారి కార్యాలయం నుంచి టెక్నికల్ వ్యవసాయాధికారి కళ్యాణ్ కుమార్, టెక్నికల్ ఏవో నవీన, విస్తరణ అధికారులు, ఆర్‌ఎస్‌కే సిబ్బంది ని యోజకవర్గంలోని మండలాల వ్యవసాయాధికారులు, డీలర్లు పాల్గొన్నారు.