Share News

Dr. Rayapati Sailaja: అంగన్వాడీల బలోపేతానికి కృషి చేయాలి

ABN , Publish Date - Nov 22 , 2025 | 04:49 AM

అంగన్వాడీ కేంద్రాలు పూర్వ ప్రాథమిక పాఠశాలల పనితీరును మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ రాయపాటి శైలజ సూచించారు.

Dr. Rayapati Sailaja: అంగన్వాడీల బలోపేతానికి కృషి చేయాలి

  • తక్కువ బరువున్న పిల్లలకు పౌష్టికాహారం అందించాలి: రాయపాటి శైలజ

తాడేపల్లి, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): అంగన్వాడీ కేంద్రాలు పూర్వ ప్రాథమిక పాఠశాలల పనితీరును మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ రాయపాటి శైలజ సూచించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలోని 3, 7 అంగన్వాడీ కేంద్రాలను ఆమె శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రా ల్లో ఉన్న తక్కువ బరువున్న పిల్లలకు మంచి పౌష్టికాహారం అందించే విధంగా చర్యలు చేపట్టాలని సీడీపీవోను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయా కేంద్రాల్లో పని చేస్తున్న సిబ్బంది, తల్లులతో ఆమె మాట్లాడారు.

Updated Date - Nov 22 , 2025 | 04:50 AM